టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు మరింత క్రేజ్ నెలకొంది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కేవలం ప్రాంతీయ భాషలోనే నటించినప్పటికీ.. మహేష్‌కు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిల్లో మహేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గతంలో నటించిన ఖలేజా సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తుంది.
ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు ఖలేజా అనే పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని అర్థం ఏమై ఉంటుంది.. తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం. వాస్తవానికి ఖలేజా అనే పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ముఖ్యంగా ఖలేజా అంటే ఎక్కువగా.. ధైర్యం లేదా పట్టుదల అనే వివరిస్తూ ఉంటారు. అలాగే హిందీలో ఖలేజా అంటే లివర్ అని అర్థం. అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు ఖలేజా అనే టైటిల్ పెట్టడానికి వెనుక మాత్రం బిగ్ స్టోరీ నే ఉందట. అప్పట్లో ఇదే టాక్ బాగా వైరల్‌గా మారింది.
సంస్కృతం ప్రకారం క అంటే 5.. లే అంటే 3 జా అంటే 4.. అంటే 534 మంది జనాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు అని టైటిల్ లోనే అర్థం వచ్చేలా ఖలేజా టైటిల్‌ను నిర్ణయించాడట త్రివిక్రమ్. మొత్తానికి ఖలేజా మూవీ ఇప్పుడు రీ రిలీజ్ అయి అభిమానుల పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ సినిమాకు అభిమానులు ఓ రేంజ్ లో క్యూ కట్టి మరి సందడి చేస్తున్నారు. తెగ హంగామా చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకే రచ్చ ఇలా ఉందంటే.. జక్కన్న డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రెచ్చిపోతారు.. ఎంతలా ఊగిపోతారో ఊహకే అందడం లేదంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.