సరిగమపలో అదరగొట్టిన ఈ అమ్మడు.. ఆ స్టార్ హీరోయిన్ కూతురని తెలుసా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మ‌డు.. ఓ స్టార్ హీరోయిన్ కూతురు అని చాలామందికి తెలిసి ఉండదు . అయితే ఈ అమ్మడు ఎవరు.. అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే న‌ట‌వారసులుగా, వారసురాళ్లుగా ఎంత మంది అడుగుపెట్టి మంచి సక్సెస్ లో అందుకుంటు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే తాజాగా మరో నట వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. అయితే.. తల్లి స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు ఈ అమ్మడు తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక్క‌డ అస‌లు ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ గా కాకుండా.. తనకంటూ సొంత స్టైల్ లో సింగర్ గా పాపులారిటీ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.

Actress Devayani Daughter Iniya Surprise Performance ❣️ | SaReGaMaPa Senior  Season 5 Promo

ఇంతకీ ఈ అమ్మడు ఎవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వర్సెస్ సక్సెస్‌లు అందుకున్న దేవయాని కూతురు. దేవయానికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో భాషల్లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న దేవయాని పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈమె తమిళ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజకుమార్‌ను 2001లో ప్రేమించి.. పెద్దలు అంగీకరించకపోవడంతో రహస్యంగా అతనిని వివాహం చేసుకుంది. ఇక ఈ జంటకు ఈనయ, ప్రియాంక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

కాగా ఇప్పుడు దేవయాని కూతురు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తల్లిలా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకుండా.. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం.. జీ తమిళ్ ఛానల్ లో ప్రసారమయ్యే సరిగమప సీనియర్ సీజన్ 5లో తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ షో ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. అందులో దేవయాని తన పెద్ద కూతురుని స్టేజ్ పైకి స్వయంగా తీసుకురావడం.. జడ్జిల్లా కళ్ళకు గంతలు క‌ట్టి ఉండగా.. ఇండియా భారతి సినిమాలోని మైల్పుల పన్ను.. పాటను అందర్నీ మెప్పించేలా ఆలపించింది. అయితే తర్వాత కళ్ళకు గంతులు తీసేసారు. జడ్జిలంతా ఆ అమ్మాయి దేవయాని కూతురు అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇక ఈన‌య‌ మొదటి నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందని దేవయాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది.