సౌత్ ఇండియా స్టార్ హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి హిట్ లిస్ట్ ఏంటో.. ఎవరి ఆస్తుల వివరాలు ఏంటో.. ఎవరి ఎక్స్పీరియన్స్ ఎంతో.. ఆ వివరాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2001లో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక చరణ్ 2007లో హీరోగా సిల్వర్ స్క్రీన్కు పరిచయం అయ్యాడు. అలా తారక్.. చరణ్ కంటే ఆరు ఏళ్ల సీనియర్.
రామ్ చరణ్ ఇప్పటివరకు తన సినీ కెరీర్లో 15 సినిమాల్లో నటించి మెప్పించగా.. ఎన్టీఆర్ 30 సినిమాల్లో ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాల్లో దాదాపు అన్ని హిట్స్. కాగా రామ్ చరణ్ 15 సినిమాల్లో 10 సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్.. సింహాద్రి, ఆది, యమదొంగ, అరవింద సమేత, దేవర లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. చరణ్.. చిరుత, మగధీర, రంగస్థలం లాంటి సెన్సేషనల్ సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తన సినీ కెరీర్లో కోట్ల ఆస్తులను కూడబెట్టారు.
ఇద్దరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రూ.500 కోట్ల అధిపతిగా.. రామ్ చరణ్ రూ.1370 కోట్ల అధిపతిగా రాణిస్తున్నారు. ఇక చరణ్ జంజిర్ సినిమాతో ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిడు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 సినిమాలో నటించాడు. ఈ సినిమాతో త్వరలో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. 2022లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అందుకోవడమే కాదు.. ఇద్దరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతుండగా.. ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తున్నాడు.