విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రిలీజ్ అయినా ఈ సినిమాకు మొదటి నుంచి విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు ముందే అన్నిచోట్ల బుకింగ్స్‌తో థియేటర్లు ఫుల్ అయిపోయాయి. దీన్నిబట్టే సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో ఆసక్తి నెలకొందో తెలుసుకోవచ్చు. ఇది సినిమాకు హైలెట్గా నిలిచిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసే రేంజ్‌లో కొల్లగొట్టినట్లు సమాచారం.
వెంకీ మామ ఓవర్సీస్ లో ఏకంగా 5 లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్లు టీం వెల్లడించింది. వీకెండ్ కూడా కలిసి రావడంతో సినిమా అతి త్వరలోనే వన్ మిలియన్ క్లబ్ లోకి జాయిన్ అవ్వనుందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా హౌస్ ఫుల్‌గా సినిమా రన్ అవుతుంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. మొదటి రోజు ఈ సినిమా ఇండియా వైట్ గా రూ.25 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టింది. వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే తో సినిమా ఫ్యామిలీ ఆడియోస్ని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.
వెంకటేష్కు జతగా ఐశ్వర్య, మీనాక్షి హీరోయిన్గా నటించిన మెప్పించారు. వీరు పాత్రలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసి ఆకట్టుకున్నారని ఆడియన్స్ వివరించారు. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించడంలో సక్సెస్ అందుకున్నాడు.