ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..? ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ, తెలుగు, తమిళ్ అని భాషలతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కుర్రాళ్ళ కలల రాకుమారిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ మనిషా కొయిరాలా. అందం, నటనతో ఎంతోమంది అభిమానులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. అప్పట్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది.
ఇక స్టార్ హీరోస్ అంతా ఈమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండేవారు. 1970 నేపాల్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 1991లో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. సౌదాగర్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలో ఆఫర్లను అందుకుంటూ ఓ వెలుగు వెలిగింది. 30 ఏళ్ల కెరీర్లు దాదాపు 70 కి పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు..తెలుగులో బాంబే సినిమాల్లో నటించిన మంచి ఇమేజె సంపాదించుకున్న తర్వాత.. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలతో హిట్ అందుకుంది. ఇంతలా సినీ కెరీర్‌లో సక్సెస్ అందుకున్న మనీషా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలను ఎదుర్కొంది.
తన పర్సనల్ లైఫ్ లో బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇవన్నీ చాలా కామన్ గా మారిపోయాయి. తన కెరీర్ లో ఏకంగా 12 మందితో ఎఫైర్ పెట్టుకుందంటూ పుకార్లు తెగ వైరల్‌గా మారాయి. వారిలో హీరో వివేక్ మిశ్రాన్, నాన్న పటేక్కర్, వ్యాపార వేత సీసిలి ఆంథోని పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈ అమ్మడు లవ్, ఎఫైర్ అంటూ వార్తలు వచ్చిన వారిలో.. ఒకరిని కూడా వివాహం చేసుకోలేదు. 2010లో వ్యాపార వేత్త సామ్రాట్ దాహాను పెళ్లి చేసుకుని కొంతకాలానికి వ్యక్తిగత కారణాలతో విడాకులు ఇచ్చింది. 53 ఏళ్ల వయసులోనూ ప్రస్తుతం సోలో లైఫ్.. లీడ్ చేస్తున్న ఈ అమ్మడు ఇటీవల క్యాన్సర్ జయించింది.