గుడ్ న్యూస్ చెప్పనున్న మెగా డాక్టర్ శ్రీజా.. మేటర్ ఏంటంటే..?

గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్ అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నుంచి.. మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. కానీ.. అవి పుకార్లే అని తెలిపాయాయి. తాజాగా మెగా కుటుంబంలో మరో శుభకార్యం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారంటూ.. పెద్ద ఎత్తున ఆ ఈవెంట్ జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఈవెంట్ ఏదో కాదు మెగా డాటర్ శ్రీజ కూతురు నివృత్తి హాఫ్ సారీ ఫంక్షన్.

Megastar Chiranjeevi Granddaughter Nivruti Birthday Photos

చిరంజీవి మనవరాలు నివృత్తి కోసం హాఫ్ సారీ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా ఈ హాఫ్ సారీ ఫంక్షన్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మెగా ఫాన్స్ మాత్రం ఫుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరు చిన్న కూతురు శ్రీజ – శిరీష్ భరద్వాజల పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దల అంగీకారం లేకుండానే బయటకు వెళ్లిపోయి శ్రీజ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది.

Chiranjeevi's daughter Sreeja drops husband Kalyaan's last name on Instagram, sparks divorce speculations

ఆ సమయంలో పవన్, చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీజ.. భరద్వాజ్‌తో కొన్నేళ్ళ కాపురం తర్వాత.. నివృతి పుట్టిన కొంతకాలానికి అతనితో విభేదాలు కారణంగా డివోర్స్ ఇచ్చేసి మెగా ఇంటికి వచ్చేసింది. పెద్దలు కుదిర్చిన వ్యక్తితో మరోసారి శ్రీజ రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత కొంతకాలానికి అతనికి కూడా శ్రీజ దూరమైంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా ప్రస్తుతం వీరిద్దరు విడిగానే ఉంటున్నారు.