ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ అనగానే టక్కున రాజమౌళి పేరు గుర్తుకొస్తుంది. కానీ.. రాజమౌళి కంటే ముందు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా కొలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస సూపర్ హిట్లతో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయిన శంకర్.. అంచలంచలుగా ఎదుగుతూ.. తన టాలెంట్‌తో సత్తా చాటుకున్నాడు. రోబో సినిమాలో శంకర్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవటంతో.. పాన్ ఇండియా రేస్ నుంచి తప్పుకున్న శంకర్.. ఇటీవల మరోసారి పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులు పలకరించడానికి సిద్ధమయ్యాడు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే గతంలో శంకర్‌కు ఓ టాలీవుడ్ బ్యూటీ సినిమాలో ఛాన్స్ కోసం బికినీ ఫోటోలను పంపించిందంటూ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోయినే వివరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తను ఎవరో కాదు కస్తూరి శంకర్. అన్నమయ్య సినిమాతో నాగార్జున సరసన నటించి తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన కస్తూరి.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా మారింది.
తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలోనూ నటిగా రాణిస్తున్న కస్తూరి.. గతంలో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఓ సినిమాలో నటించింది. ఆ సినిమానే భారతీయుడు. కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో కమల్ చెల్లెలుగా కస్తూరి నటించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో చెప్పుకోచ్చిన కస్తూరి.. శంకర్ డైరెక్షన్లో సినిమా అనేసరికి తాను ఎంత ఎక్సైట్ అయ్యానని.. ఎలాగైనా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావాలని శంకర్‌కు తన బికినీ ఫోటోలను పంపించినట్లు వెల్లడించింది. అయితే ఆ బికినీ ఫోటోలు శంకర్ చూసినా.. అప్పటికే రంగీలా సినిమా రిలీజ్ అయి ఊర్మిళా బికినీ ఫొటోస్ వైరల్ కావడంతో.. హీరోయిన్గా కాకుండా తనను చెల్లెలు పాత్రలో తీసుకున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మనీషా కోయిరాలా నటించి ఆకట్టుకుంది.