పుష్ప 2 రిలీజ్ కు ముందు సరికొత్త వివాదంలో బన్నీ.. !

గతంలో నందమూరి హీరోల మధ్యన చీలిక‌ ఏర్పడిందంటూ వారి అభిమానుల మధ్యన గట్టి పోటీ నడుస్తూ ఉండేది. ఎప్పటికప్పుడు ఒక్కరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు మెగా ఫ్యామిలీ లోనూ జరుగుతుంది. మెగా వర్సెస్ అల్లు వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ చేసిన కొన్ని చర్యలు మెగా అభిమానులను విపరీతంగా హ‌ర్ట్‌ చేశాయి. దీంతో అక్కడ నుంచి ప్రారంభమైన వార్‌ ఇప్పుడు ఫ్యాన్స్ నడుమున సీరియస్ గొడ‌వ‌గా మారింది. అల్లు అర్జున్.. శిల్పారవికి సపోర్ట్ చేయడం కేవలం పవన్ ఫ్యాన్స్‌కే కాదు.. మెగా ఫ్యాన్స్ అందరిని హార్ట్ చేసింది. అలాగే మెగా యంగ్ హీరోలు కూడా బాగా నచ్చుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.

Allu Arjun vs Mega family.. ? A war going on.. ?

ఈ ప్రచారం తర్వాత కూడా ఓ ఈవెంట్లో పాల్గొన్న బన్నీ చేసిన కామెంట్స్ మెగా హీరోను ట్రిగ్గర్ చేసినట్లు అనిపించింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా బన్నీ అభిమానులు ఆఫ్లైన్లో రెచ్చిపోయి మరి విచ్చలవిడిగా నెగిటివ్ ట్రోల్స్ తో.. కామెంట్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరింతగా వార్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. మెగా అభిమానులు దీనిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పవన్‌ను టార్గెట్ చేస్తూ గమ్ము.. గుండు అంటూ, ఏం పీకలేరు బ్రదర్ అంటూ.. ఫ్లెక్సీలను బన్నీ అభిమానులు ఆఫ్ లైన్ లో పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫ్లెక్సీల పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో ఓ హీరో ఫ్యాన్స్ మరో హీరోపై ఇలాంటి కౌంటర్స్ వేసేవారు. కానీ.. మెగా హీరోగా వచ్చిన బన్నీ అభిమానులే మెగా హీరో పై ఇలాంటి ట్రోల్స్ చేయడంతో మెగాస్టార్, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Mega family and Allu family are all the same-Hyper adi - The Capital  English News Daily

పుష్ప 2 రిలీజ్ థియేటర్స్ దగ్గర కూడా ఇలాంటి ఫ్లెక్సీలే కనపడితే.. అక్కడ సరికొత్త వార్ మొదలవడం ఖాయం అనడంలో సందేహం లేదు. అయితే ఎవరికి తెలియకుండా ఇలా ఎక్కడపడితే అక్కడ చెత్త ఫ్లెక్సీలు పెట్టడం కాదు.. ఎక్కడ పెడుతున్నారో ఆ థియేటర్లు కూడా మెన్షన్ చేస్తే మా పవర్ ఏంటో చూపిస్తామంటూ మెగా అభిమానులు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పెడ‌తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బ‌న్నీ ఫ్యాన్స్ సవాళ్లు విస్తడుతున్నారు. ఇలా పుష్ప2 రిలీజ్ టైం లో బన్నీ, మెగా అభిమానుల మధ్యన వార్ జరగడం పుష్ప‌2 రిలీజ్ కు ఆటంకం కల్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక హీరోలలో ఈ కాంట్రవర్సీలు ఆగిపోయినా.. అభిమానులలో మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.