కొండ సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్.. వారి సపోర్ట్ లేకుంటే..

ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత.. నాగ‌చైత‌న్య విడాకుల‌ గురించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంచలన కామెంట్ చేసి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుపడుతూ టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ ఆమెపై ఫైర్ అయ్యారు. నిరాధార ఆరోపణలు చేయవద్దని.. సినీ ప్రముఖులు, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడ్డారు. ఇక నాగార్జున ఏకంగా కొండా సురేఖ పై ప‌రువునష్టం దాబా వేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్‌ను ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే తాజాగా సమంత.. కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయింది.

Samantha Ruth Prabhu, Varun Dhawan Starrer Citadel Honey Bunny To Release On Nov 7; Trailer Out On Oct 15 - News18

చాలాకాలం తర్వాత సిటాడల్ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది సమంత. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తాజా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న శ్యామ్.. కొండ సురేఖ వివాదం పై మరోసారి స్పందించింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది నాకు మద్దతుగా నిలిచారని.. వారందరి సపోర్ట్ కారణంగా ఇప్పుడు తాను ఇక్కడ ఉన్నానంటూ వెల్లడించింది. నా గురించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం నా వైపే నిలబడ్డారు. వారందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. వారి ప్రేమ సపోర్ట్ కారణంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న అంటూ సమంత చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీ తో పాటే.. నా ఫ్యాన్స్.. వారికి నాపై ఉన్న ప్రేమ, విశ్వాసమే నన్ను త్వరగా ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసాయంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ నాకు సహాయం అందించకపోయి ఉంటే దీని నుంచి కోల్పోవడానికి నాకు మరింత సమయం పట్టేదని.. ఇలాంటి టైంలో వారే లేకుంటే నేను మరింత కృ్గిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అందరి మద్దతు వల్లే నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్న అంటూ సమంత వివరించింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.