నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్టుగా రాణించిన అన్‌స్టాపబుల్ సీజన్‌కు గతంలో ఎలాంటి పాపులారిటీ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అహా ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అయినా ఈ షో.. మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4ను ప్రారంభించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీని ప్రోమో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇప్పటికే ఈ షో పై ప్రేక్షకుల విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈసారి బాలయ్య ఎవరిని గెస్ట్‌గా పిలుస్తున్నారు అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. కాగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ సీజన్ 4 కి ఫస్ట్ గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రానున్నాడని సమాచారం. గతంలో కూడా సీజన్ 2 కి చంద్ర బాబు వచ్చి సందడి చేశారు. కాగా అప్పట్లో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉంటూ ముఖ్యమంత్రి హోదాల్లో సీజన్ 4లో సందడి చేయనున్నాడు.
దీంతో ఈ ఎపిసోడ్ పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నయి. ఈ క్రమంలోనే బాలయ్యతో.. చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకోనున్నారు అన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. గతంలో బాలయ్య, చంద్రబాబు ఎన్నో సరదా విషయాలను షేర్ చేసుకున్నారు. తమదైన చిలిపితనంతో ఒకరికి ఒకరు ప్రశ్నలు సంధిస్తూ.. తికమక పెట్టుకున్నారు. కాగా.. ఇప్పుడు ఇద్దరూ మరోసారి కలిసి సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఇది నిజమైతే ఆ కిక్కే వేరు అంటూ.. ఇక రచ్చరంబోలానే అంటూ.. అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.