దేవర పార్ట్2 బ్లాస్టింగ్ అప్డేట్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. తెర‌కెక్కిన‌ తాజా మూవీ దేవర.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎన్నో అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మిక్స్డ్ టాక్‌ వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా కలెక్షన్లను పుంజుకుంటూ భారీ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా కొరటాల.. దేవర పార్ట్ 1 రిలీజ్ కాకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 1 చూసిన ఆడియన్స్ అందరిలోనూ పార్ట్ 2 పై ఆసక్తి నెలకొంది.

Devara' Box Office Rampage: Jr NTR's Latest Breaks Records with Rs. 300  Crore Weekend!

ఎప్పుడెప్పుడు దేవరా పార్ట్‌2 రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులంతా ఆరటపడుతున్నారు. అయితే పార్ట్ 2 పై ఇటీవల దేవ‌రలో న‌టించిన ఓ ఆర్టిస్ట్‌ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. పార్ట్ 2 లో వరాతో పాటు తండ్రి దేవర కూడా ఒకే స్క్రీన్ పై కనిపించనున్నాడట. ఇక క్లైమాక్స్ లో దేవర కచ్చితంగా చనిపోయినట్లు చూపించలేదు. ఈ క్రమంలోనే దేవర, వర ఇద్దరు స్క్రీన్ పై కనిపిస్తారంటూ వస్తున్న కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.

NTR Dual role curse: Devara and Vara or Devara vs Vara?

అయితే దేవర కోసం వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ ఇదే విషయాన్ని వెల్లడించాడట. దేవరపార్ట్ 1లో ఆయన చనిపోయినట్లు క్లియర్ గా చూపించలేదు. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరే కాదు, ముగ్గురు ఎన్టీఆర్లు కూడా ఉండొచ్చేమో అంటూ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇదే నిజమైతే.. దేవర పార్ట్ వన్ విషయంలో ఏదైనా డిసప్పాయింట్ ఉన్నా.. దేవర పార్ట్ 2 లో ఆ లోటు తీరిపోతుంది అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.