వరుసగా 15 డిజాస్టర్లు.. జైల్లో చిప్పకూడు.. మళ్లీ రీఎంట్రీ తో రూ. 3 వేల కోట్లు.. ఆ నటుడు ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఒక్కోసారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న యాక్టర్ గా సక్సెస్ కావడం చాలా కష్టం. ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అయితే ఎంత పెద్ద స్టార్ యాక్టర్ వారసులైన.. ఫ్లాప్స్ వరుసగా ఎదురైతే ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే న‌టుడు మాత్రం వరుసగా 15 డిజాస్టర్లు ఎదురైనా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఓ సందర్భంలో జైలుకు వెళ్లి చిప్పకూడు కూడా తినాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇండస్ట్రీ నటుడిని బ్యాన్ కూడా చేసింది. అయితే జైల్‌ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్‌తో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు సంజయ్ దత్.

Sanju's Debut Film Rocky Movie Review: Sanjay Dutt | Tina Munim | Sunil  Dutt | FilmiBeat

బాలీవుడ్ బాడ్ బాయ్ గా ముద్ర వేసుకున్న‌ ఈయనకు టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బ్యాన్ చేసిన తిరిగి వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్లాక్ చేశాడు. ఆయన నటించిన సినిమాలు ఏకంగా రూ.3000 కోట్ల వసూళ్లు కొల్లగొట్టాయి. హీరోగా, విలన్‌గా ఆకట్టుకున్న సంజయ్ దత్ స్టోరీ.. ఎందరికో ఇన్స్పిరేషన్. కష్టపడితే విజయం ఎలా దక్కించుకోవచ్చో.. ఈయన లైఫ్ స్టైల్ నుంచి తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సునీల్ దావ్ కుమారుడిగా.. చిన్నప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్.. తర్వాత హీరోగా కెరీర్ ప్రారంభించాడు. రాఖీ లో టీనా అంబానీతో కలిసి నటించిన ఈయన.. మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే తర్వాత కొన్ని ఫ్లాపులు ఎవరైనా 1986లో మహేష్ భ‌ట్‌ డైరెక్షన్లో వచ్చిన నామ్‌ సినిమాతో మరోసారి కెరీర్ కు కమ్‌ బ్యాక్ వచ్చింది.

Sanjay Dutt | Yerawada Prison | 14 Days Furlough | Fund Raiser Drama |  Parole - Filmibeat

ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటించి సక్సెస్లు అందుకున్నాడు. ఇక 1993లో బాంబు పేలుడు కేసులో ఆయన హస్తం ఉందంటూ ఆరోపణలు రావడం.. కేసు నమోదవడంతో.. జైల్లో కూడా గడపాల్సి వచ్చింది. తర్వాత బాలీవుడ్ సంజయ్‌ను బ్యాన్ చేసింది. ప్రముఖ స్టార్ట్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా.. సంజయ్ పై జాలిపడ్డారు. ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. సంజయ్ జైలుకు వెళ్ళినప్పుడు నాకు ఆయనతో అసలు పరిచయం లేదు. ఆ టైంలో బాలీవుడ్ అంతా ఆయన్ని బ్యాన్ చేయడం సరికాదని నాకు అనిపించింది. అందుకే నేను సంజయ్ ఇంటికి వెళ్లి అతనితో కలిసి సినిమా అనౌన్స్ చేశా. సంజయ్ తండ్రి నిన్ను కూడా బ్యాన్ చేస్తారు అని హెచ్చరించినా.. నేను పట్టించుకోలేదు అంటూ వెల్లడించాడు. అయితే సంజ‌య్‌ జైలు నుంచి వచ్చిన తర్వాత వినోద్‌ను సంప్రదించాడు. ఆ టైంలో మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాలో హీరో ఫ్రండ్‌ రోల్‌ సంజయ్ కి ఆఫర్ చేశాడు.

Sanjay Dutt dropped from Son of Sardaar 2 after his UK visa application was  rejected over arrest in 1993: Report | Bollywood - Hindustan Times

సంజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ హీరో రోల్ షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేశాడు. ఆ పాత్రను సంజయ్‌కే ఇచ్చారు. అతన్నే హీరోగా సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తర్వాత 2003 నుంచి 2006 వరకు సంజయ్ నటించింది 15 సినిమాలు వరుస ప్లాప్స్. అయినా మళ్లీ.. లగే రహోమ్ మున్న బాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు. అగ్నిపథ్‌ సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అలా కం బ్యాక్ ఇస్తున్న టైం లో సంజయ్ దత్తులు లంక్ క్యాన్సర్ రావడం ముంబైలో చికిత్స చేసుకొని బయటపడ్డారు. చికిత్స టైం లో కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో అధిరా పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించాడు. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.1200 కోట్ల షేర్‌వ‌సుళ‌ను సాధించింది. జవాన్ లో క్యామియో రోల్ ప్లే చేసిన సంజయ్ దత్.. విజయ్ ద‌ళపతి లియో సినిమాలను విలన్ గా నటించాడు. ఈ మూడు సినిమాలు కలిపి దాదాపు రూ.3 వేల కోట్ల వసూళ్లను కలగొట్టాయి. ఇలా సంజయ్ కెరీర్ లోనే మరోసారి నటుడుగా సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు పలు టాలీవుడ్ సినిమాల్లోనూ సందడి చేస్తున్నాడు.