టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ క్రేజ్ మరే హీరోకు లేదనటంలో అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన అది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు మొదటి షో రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ డైరెక్టర్లు పవన్ ను నమ్ముకుని తమ కెరీర్ రిస్క్ లో పడేసారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు.. వారి కెరీర్ రిస్క్‌లో పడటానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
క్రిష్ జాగర్లమూడి
పవన్ కళ్యాణ్ హీరోగా హర హర వీరమల్లు పార్ట్1.. స్క్వాడ్ అండ్ స్పిరిట్ సినిమాకు కృష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన ఈ సినిమా మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అయినా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. 2022 నాటికి 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా.. తర్వాత సినిమా షూటింగ్ అసలు ముందుకు కదల్లేదు. ఈ క్రమంలో ఈ రెండేళ్లు క్రిష్ కాళీగా గడిపారు. అదే సమయాన్ని వేరే సినిమాలకు కేటాయించి ఉంటే కచ్చితంగా ఈ రెండేళ్లలో రెండు సినిమాలైనా తర్కెక్కించి ఉండేవాడని.. ఇలా పవన్ కారణంగా క్రిష్ కెరీర్ రిస్క్ లో పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాదాపు క్రిష్ డైరెక్షన్లో 60% ఈ సినిమా పూర్తి కాగా.. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను, సెకండ్ హాఫ్ లో సగం భాగంకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్
ఇక త్రివిక్రమ్‌కు పవర్ స్టార్ పై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి పవన్ కోసం స్క్రిప్ట్, క్యారెట్రైజేషన్ మిగతా విషయాల పైన ఆయన స్పెషల్‌గా శ్రద్ధ తీసుకుంటూ ఎక్కువ సమయాన్ని పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే కేటాయిస్తూ ఉంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం చివరిగా తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాను ఆ శ్రద్ధ చేశాడంటూ అప్పట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్. ఇలా పవన్ కళ్యాణ్ కోసం తన సినిమాలను పట్టించుకోకుండా కెరీరెను రిస్క్ లో పెట్టుకుంటున్నాడని టాక్.
హరీష్ శంకర్
పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2021లో అనౌన్స్ చేసిన మేకర్స్.. కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తి చేశారు. కాగి మొన్నటి వరకు హరీష్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూసి తన కెరీర్ రిస్క్ లో పెట్టడు. అప్పటివరకు కేవలం పవన్ సినిమాల కోసం మిగతా ప్రాజెక్టులను హోల్ లో పెట్టాడు. ఇక ఈ సినిమా ఆలస్యంతో విసిగిపోయిన ఆయన రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమాను ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇప్పటికైనా మిస్టర్ బచ్చన్ సినిమాను ప్రారంభించి మంచి పని చేశాడంటూ పలు కామెంట్లు వినిపించాయి. ఇక రవితేజతో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు.. రాజకీయాలతో బిజీగా ఉంటూ పోస్ట్‌పోన్ చేయడం వల్ల.. ముగ్గురు డైరెక్టర్ల కెరీర్ రిస్క్‌లో పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.