స్టార్ హీరోయిన్స్ కొత్త డిమాండ్..ఇకపై అలా చేయరట..మేకర్స్ చచ్చారు పో..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రకరకాల డిమాండ్స్ చేస్తున్నారు . కొందరు హై రెమ్యూనరేషన్ కావాలి అని మరికొందరు తమతో పాటు తమ ఫ్రెండ్స్ కి కూడా ప్రొడక్షన్ టీమే మిగతా ఖర్చులు భరించాలి అని.. మరికొందరు సినిమా ప్రమోషన్స్ కి రాము అని ..ఇలా రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో ఒక సరికొత్త న్యూస్ హైలెట్గా మారింది . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యూటీస్ అయిన స్టార్ హీరోయిన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నారట.

ఏదైనా సినిమాలో నటించిన తర్వాత ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ పై ట్రోలింగ్ జరిగితే చిత్ర బృందమే రెస్పాన్సిబులిటీ తీసుకొని సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాలి అని.. తమ పర్సనల్ లైఫ్ ని స్పాయిల్ చేసే విధంగా ఏ సినిమా విషయంలోనైనా ట్రోలింగ్ జరిగితే డైరెక్టర్ మేకర్స్ పూర్తి బాధ్యత వహించాలి అనే విధంగా అగ్రిమెంట్లో సరికొత్త రూల్ ని ఆడ్ చేయబోతున్నారట. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ విషయంలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది అది మన అందరికి తెలిసిందే .

ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది .. ఈ సినిమాలో బట్టలు విప్పి తిరుగుతుంది ..రకరకాల కామెంట్స్ చేస్తూ హీరోయిన్స్ ఫ్యామిలీ పై కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో హీరోయిన్స్ అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని అగ్రిమెంట్లో కొత్త పాయింట్ ని ఆడ్ చేయబోతున్నారట. ఈ నిర్ణయంతో నైనా..హీరోయిన్స్ పై ట్రోలింగ్ ఆగుతుంది ఏమో చూద్దాం..?