నువ్వు ఓవర్ చేయొద్దు డైరెక్టర్ కు రవితేజ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం ఏంటంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు తరికెక్కి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. షాక్, మిరపకాయ రెండు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా ఈ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న మూడో సినిమా మిస్టర్ బ‌చ్చ‌న్ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సర్వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక మాస్‌మ‌హ‌రాజ్ సెట్స్ అందరితో సరదాగా ఉంటార‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌.

Ravi Teja and Harish Shankar to team up for the third time?

అలాంటి రవితేజ ఓ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు హరీష్ శంకర్. తాజాగా సోషల్ మీడియా వేదికగా హరిష్ శంకర్.. రవితేజను ఉద్దేశిస్తూ ఓ పోస్టులు షేర్ చేసుకున్నాడు. కాశ్మీర్ వాలీలో రవితేజ స్టైలిష్ లుక్ తో దర్జాగా కూర్చున్న పిక్ షేర్ చేస్తూ.. ప్రపంచంలో అందరికీ వయసు వస్తుంది.. ఒక అన్నయ్యకు తప్ప అంటూ రవితేజను ఉద్దేశించి పోస్ట్‌ షేర్ చేశాడు. త్వరలోనే కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బ‌చ్చ‌న్ షూటింగ్ పూర్తవుతుందని హైదరాబాద్‌లో దిగుతామంటూ ఆయన వివరించాడు. ఈ పోస్ట్ చూసిన రవితేజ దీనిపై రియాక్ట్ అయ్యాడు. హరీష్ శంకర్ పోస్ట్ పెట్టిన పది నిమిషాలకే రవితేజ స్పందిస్తూ.. ఓవర్ చేయకురోయు.. నీ దిష్టే తగిలేలా ఉంది అంటూ కామెంట్ చేశాడు.

Ravi Teja, Harish Shankar conversation excites all | cinejosh.com

రవితేజ ఈ కామెంట్ ఫన్నీగా చేసినా ఆయన చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక రవితేజ రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉండగా.. ఈయన గత రెండు మూడు సినిమాలు ఊహించిన రేంజ్ లో హిట్ అందుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న రవితేజ.. ఈ సినిమాతో ఎలాగైనా హీట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు అంటూ టాక్. ఇక మిస్టర్ బచ్చన్ తో రవితేజ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.