భర్త ఎంత బలవంతం చేసిన.. ఈ విషయాలు మాత్రం భార్య ఎప్పటికి చెప్పకూడదు..ఎందుకంటే..?

సాధారణంగా అందరూ అంటూ ఉంటారు భార్య భర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అని.. అలా ఉంటే వాళ్ళ వైవాహిక జీవితం అస్సలు బాగోదు అని..కానీ కొన్ని కొన్ని విషయాలలో భర్తకి భార్య కొన్ని విషయాలు చెప్పకూడదు అని మన పురాణమే చెప్తుంది . ఆచార్య చాణుక్యుని ప్రకారం ఈ నాలుగు విషయాల గురించి ఒక భార్య తన భర్తకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదట . అదే న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది . ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి . అది ఎంత క్లోజైనా సరే పక్కవాళ్లకు షేర్ చేయరు .

అయితే కొందరు మాత్రం తమ భర్తలకు అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేస్తుంటారు . కొంతమంది తమ జీవిత భాగస్వామి దగ్గర కూడా కొన్ని విషయాలు చెప్పుకోలేదు . కానీ పురుషులు మాత్రం అలాంటి విషయాలను రహస్యాలను తమ భార్యలకు ఏదో ఒక సందర్భంలో చెప్పేస్తారు. ఆడవాళ్లకు పైకి ప్రశాంతంగా కనిపించిన వారి మదిలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఆలోచనలు మెదులాడుతూనే ఉంటాయి . వాటిని అరికట్టడం ఎవరి తరం కాదు అంత సులభము కాదు.

*ఒక భార్య తన భర్తకి చెప్పకూడని నాలుగు విషయాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. భర్త దగ్గర ఎంత చనువుగా ఉన్నా సరే ఒక భార్య తన పాస్ట్ ప్రేమ గురించి పాస్ట్ ఎఫెక్ట్స్ గురించి ఒక భర్తకు చెప్పకపోవడం మంచిది అంటున్నారు . ఏ అబ్బాయి కూడా తన భార్య పెళ్లికి ముందు వేరొకరితో ప్రేమ పంచుకుంది అని తెలిస్తే అసలు ఊరుకోరు సహించలేరు.

*కుటుంబ నిర్ణయాలు ప్రతి ఇంట్లోనూ గొడవలు తగాదాలు సహజం.. అత్తగారింటి విషయాలు అమ్మగారు ఇంటిదగ్గర అమ్మగారింటి విషయాలు అత్తగారు ఇంటిదగ్గర అస్సలు చెప్పకూడదు . మరీ ముఖ్యంగా అమ్మగారింట్లో జరిగిన విషయాలు.. వాళ్ళు పడే బాధలు ..వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల గురించి భర్త వద్ద అస్సలు చెప్పకూడదు ..అది పుట్టింటి ని అవమానించిన్నట్లు..

*భార్య ఏవైనా తెలియకుండా డబ్బులు దాచినప్పుడు ఆ డబ్బులకు సంబంధించిన విషయం గురించి భర్తకు అస్సలు చెప్పకూడదట. భర్తకు అత్యవసర పరిస్థితిలో ఆ డబ్బులు ఇవ్వాలి కానీ నేను డబ్బు దాచుతున్నాను అన్న విషయం చెప్పకూడదట. అలా చెప్తే భర్తకు డబ్బులు వృధా చేసే ఆలోచనలు ఎక్కువగా వస్తాయట.

*తన భర్తను ఎవరైనా అరిచినా.. లేదా తిట్టిన ..చాడీలు చెప్పిన ఆ విషయాలను మళ్లీ తమ భర్త దగ్గరికి తీసుకెళ్లి ఆడవారు చెప్పకూడదట. అలాంటి సందర్భాలలో భర్తలకు చాలా కోపం వస్తుందట..!!