కల్కి సినిమా ఎఫెక్ట్: మహేష్ బాబుతో ఆ పని చేయించబోతున్న రాజమౌళి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . అది చిన్న కాదు పెద్ద కాదు.. సాఫ్ట్వేర్ కాదు కూలి పని చేసుకునే వాళ్ళు కాదు ..రాజకీయ నాయకులు కాదు సినీ ప్రముఖులు కాదు .. ఎక్కడ చూసినా సరే కల్కి కల్కి కల్కి అంటూ మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా వీకెండ్ వచ్చేస్తూ ఉండడంతో ఈ వీకెండ్ ఫ్యామిలీ అంతా కుటుంబ సభ్యులతో వెళ్లి కల్కి సినిమా చూడాలి అని ప్లాన్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే కల్కి కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో ప్రభాస్ నటించిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ లో నెగిటివ్ షేడ్స్ లో కూడా చూపించాడు ప్రభాస్ ని డైరెక్టర్.. అయితే ఇప్పుడు అలాంటి షేడ్స్ లోనే రాజమౌళి సైతం మహేష్ బాబును చూపించబోతున్నారట .

దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి మహేష్ బాబుతో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ను తెరకెక్కిస్తున్నారు. ఫుల్ టు ఫుల్ అడ్వెంచర్స్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది . కల్కి సినిమా చూసిన తర్వాత రాజమౌళి కూడా మహేష్ బాబు చేత నెగిటివ్ షేడ్శ్ ఉన్న క్యారెక్టర్ కొన్ని నిమిషాల పాటు చేయించబోతున్నారు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి నెగిటివ్ షేడ్స్ పాత్రలో మన మహేష్ బాబు ఏ రేంజ్ లో మెప్పిస్తాడో..??