పెద్దింటి కొడుకుని పెళ్లి చేసుంటే..ఆ తర్వాత ఏ హీరోయిన్ పరిస్థితి అయినా ఇంతేనా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతకుముందు స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత మాత్రం సైలెంట్ గా మారిపోతున్నారు. దానికి కారణమేంటా..? అనే విషయం జనాలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో ఏలేసిన బ్యూటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు . అరాకొరా సినిమాలలో నటిస్తున్నారే కానీ ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ సాటిస్ఫైడ్ గా కనిపిస్తున్న దాఖలాలు మాత్రం లేవు.

మరీ ముఖ్యంగా సమంత దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత తన ఫ్రీడం కోల్పోయినట్లు అందరూ భావించారు. పెళ్లి తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా పెట్టడం వల్లనే ఆమె విడాకులు తీసుకుంది అన్న ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. అయితే ఇప్పుడు అదే లిస్టులోకి వచ్చింది లావణ్య త్రిపాఠి అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు . ఒకప్పుడు లావణ్య త్రిపాఠి చాలా చాలా యాక్టివ్ గా కనిపించేది ..

అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు అయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయింది . సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా చాలా రేర్ గా పెడుతుంది . సినిమాలకు కూడా ఎక్కువగా కమిట్ అవ్వడం లేదు. దీంతో పెద్దింటి హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద ఇంటికి కోడలు అయిన తర్వాత ప్రతి హీరోయిన్ పరిస్థితి అలానే ఉంటుంది అంటున్నారు జనాలు. వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత కఠినంగా ఉంటాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!