ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? కెరియర్ లోనే హైయెస్ట్…!

జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే గూస్ బంప్స్ తెప్పించే కటౌట్ ఉన్న హీరో ఇతగాడే అని చెప్పాలి. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని ఉంది సినిమాలో ఎంత సైలెంట్ గా కనిపించాడో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ..అంతే సైలెంట్ గా కనిపించాడు. కానీ ఒకటే డిఫరెన్స్ ఒ.,,క్కొక్క సినిమాకి తనలోని నటన లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు.

ఒక సినిమా విషయంలో చేసిన తప్పును మరొక సినిమాల విషయంలో చేయరు . అది అందరికీ తెలిసిందే.. తారక్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .. వార్ 2 ను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేసాడు. ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు . ఈ రెండు సినిమా షూట్స్ కంప్లీట్ అవ్వగానే ఆగస్టులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. దాదాపు ఈ సినిమా కోసం 130 కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్ . ఇప్పటివరకు 70 – 80 కోట్లు పుచ్చుకున్న తారక్ దేవర 100 కోట్లు తీసుకుంటున్నారట. అదే విధంగా వార్ 2 కోసం కూడా 100 కోట్లు తీసుకుంటున్నారట .. అయితే ప్రశాంత్ నీల్ సినిమా కోసం మాత్రం ఏకంగా 130 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఆయన కెరియర్ లో ఇదే హైయెస్ట్ రికార్డ్ రెమ్యూనరేషన్ కావడం గమనార్హం..!!