నాగ్ అశ్విన్ ఎంతమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేశాడో తెలుసా..? అందుకే ఇంత తోపైనా దర్శకుడుగా మారాడు..!

నాగ్ అశ్వీన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే.. ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా రాజమౌళి పేరే మొదట వినిపించేది. ఆ తర్వాత సుకుమార్ లాంటి వాళ్ళ పేర్లు వినిపించేవి . అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నాగ్ అశ్వీన్ పేరే మారు మ్రోగిపోతుంది. దానికి కారణం కల్కి సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు ఎవరు చూస్ చేసుకొని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు నాగ్ అశ్విన్ .

మరి కొద్ది గంటల్లోనే కల్కి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు . అంతేకాదు ఇప్పుడు ఈయనకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఒకానొక సమయంలో స్కూల్ ఆవరణలో ఎవరో చెట్లు నరికేస్తుంటే చూసి బాధపడిపోయి ప్రకృతిని నాశనం చేస్తే ఏం జరుగుతుందని స్టోరీ కూడా ప్రిన్సిపాల్ కి వినిపించారట.

నాగ్ అశ్వీన్ తల్లిదండ్రులు డాక్టర్లు కావడం విశేషం . కాగా నాగ్ అశ్వీన్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు . శేఖర్ కమ్ముల దగ్గర కూడా నాగ్ అశ్వీన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు . అంతేకాదు మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు కూడా వర్క్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది నాగ్ అశ్వీన్ నే..!!