మొన్న కోహ్లీ..నిన్న నాగ్.. నేడు ఈ స్టార్ హీరోయిన్.. బ్యాక్ టూ బ్యాక్ తారక్ ని పొగిడేస్తున్నారే..!

గత 72 గంటల నుంచి సోషల్ మీడియాలో తారక్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ గతంలో స్టార్ సెలబ్రిటీస్ తారక్ ను పొగిడేసిన సందర్భాలకు సంబంధించిన వీడియోలను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు నందమూరి అభిమానులు . మొదటగా విరాట్ కోహ్లీ గతంలో ఎన్టీఆర్ను పొగిడేసిన వీడియోను బాగా ట్రెండ్ చేశారు . ఆ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఆ తర్వాత ఒకానొక ఈవెంట్లో నాగార్జున ..అమితాబచ్చన్ బాలీవుడ్ లో ఎలా డైలాగ్స్ చెప్తారో.. టాలీవుడ్ లో అలా డైలాగ్స్ చెప్పే ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ ని అంటూ బాగా పొగిడేసారు .

దానికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సౌత్ ఇండియాలోనే హీరోయిన్గా మారిపోయిన నయనతార గతంలో ఎన్టీఆర్ను పొగిడేసిన వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకానొక ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ ఓ రేంజ్ లో తారక్ ని పొగిడేసింది . “తారక్ డైలాగ్ డెలివరీ ..డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంటాయని.. అలా చేయడం మరొక హీరో వల్ల కాదు అని ..అది అందరికీ తెలిసిన విషయమేనని.. ఎలాంటి కష్టమైన స్టెప్స్ అయినా కష్టతరమైన డైలాగ్ అయినా..సింగిల్ టేక్ లో చెప్పగలనటుడు ఎన్టీఆర్ అని ఎమోషనల్ ఫెలో అద్భుతంగా ..ఎక్స్ప్రెషన్స్ పలికించగల హీరో ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది”.

ప్రజెంట్ దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కేవలం యంగ్ హీరోయిన్స్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ను ఓ రేంజ్ లో పొగిడేసారు . ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చే హీరోలలో ఫస్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఉంటారు అని ..గతంలో కుష్బూ కూడా పొగిడేసిన విషయం తెలిసిందే . ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ మనసులోని కోరికను కూడా బయటపెట్టింది..!!