ఆ హీరోయిన్ కి అన్నగా వెంకటేష్..అద్దిరిపోయే పిచ్చెక్కించే కాంబో ఇది..!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు వెంకటేష్ . అఫ్ కోర్స్ చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున -వెంకటేష్ ..నలుగురు కూడా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్ లాంటివాళ్ళు . ఆ విషయం అందరికీ తెలిసిందే . ప్రజెంట్ చిరంజీవి – బాలకృష్ణ హీరోలుగా ఇంకా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉండగా .. నాగార్జున – వెంకటేష్ హీరోలుగా సినిమాలు చేస్తూనే ..

పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి ఓకే చేస్తున్నారు . ఇప్పటికే ధనుష్ నటిస్తున్న కుబేర్ సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా ఇదే మూమెంట్లో వెంకటేష్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి శ్రీ లీలాకు అన్నపాత్రలో కనిపించబోతున్నారట . టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నాచెల్లెల సెంటిమెంట్తో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.

అయితే నేటి జనరేషన్ అన్న చెల్లెలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని చూపిస్తూ కొత్త డైరెక్టర్ అద్దిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట . అందులో వెంకటేష్ అన్నగా నటిస్తూ ఉండగా చెల్లిగా శ్రీలీల నటించబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఇది క్రేజీ క్రేజీ కాంబో అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!