సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించే వాళ్లకి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి హార్ట్ లేదు అనుకుంటూ ఉంటారు జనాలు . ఎందుకంటే వాళ్లు తెరపై ఎప్పుడు అన్ని సీన్స్ చూస్తూ ఉంటారు అని .. అలాంటీ సీన్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు అని ..వాళ్ళకి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు అనే భ్రమ అందరికీ ఉంటుంది . అయితే అది తప్పు అని ప్రూవ్ చేశారు చాలామంది . తాజాగా అదే లిస్టులోకి వచ్చాడు కృష్ణవంశీ . కృష్ణవంశీ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు .
ఒకప్పుడు అంటే కృష్ణవంశీ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు . ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు . కృష్ణవంశీ క్రేజ్ మొత్తం ఢమ్మాలంటూ పడిపోయింది . కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో తెరకెక్కించిన సినిమాలకు కూడా ఆయనకు పెద్దగా సక్సెస్ తీసుకోరాలేకపోయాయి. కాగా రీసెంట్గా కృష్ణవంశీ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఆయన తన సినిమా గురించి మాట్లాడుతూ దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని తలుచుకొని స్టేజ్ పైనే ఎమోషనల్ అయిపోయారు .
పాటలు విషయం వచ్చేవరకు బాగానే ఉన్న కృష్ణవంశీ.. ఆ పాటల విషయాలను గుర్తు చేసుకుంటూ .. సిరివెన్నెల సీతారామ గారి సీతారామశాస్త్రి గారిని బాగా మిస్ అవుతున్నామంటూ గుక్క పట్టి ఏడ్చేశారు . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇండస్ట్రీలో లేకపోవడం అందరికీ తీరని లోటు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు . అంతేకాదు కృష్ణవంశీకి ఆయనకు మధ్య ఉన్న బాండింగ్ ని గుర్తు చేసుకుంటున్నారు..!!