సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణమే . అయితే వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని లేదు . అలా వచ్చిన ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవ్వాలని లేదు . ఎవరి టాలెంట్ వాళ్లది . జనాలు నమ్మితే ఓట్లు వేస్తారు జనాలు నమ్మకపోతే ఓట్లు వేయకుండా ఓడిపోయేలా చేస్తారు. అయితే పొలిటీషియన్స్ మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లను చాలా చులకనగా చూస్తూ ఉంటారు . కాగా గతంలో ఎంతోమంది స్టార్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అయితే అందరిలోకి హైలెట్గా నిలిచింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ . అతి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ లయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో సెటిల్ అయిపోయిన లయ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది .
కాగా రీసెంట్గా పొలిటికల్ పరంగా కొన్ని కామెంట్స్ చేసింది . అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజా పేర్లు కూడా ప్రస్తావించడం గమనార్హం. “రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్ కొంచెం టిపికల్ గా ఉంటుంది అని నా అభిప్రాయం.. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజా లాంటివాళ్ళు పొలిటికల్ లీడర్స్ లా మాట్లాడేస్తూ ఉంటారు . కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ చూడండి అలా ఎప్పుడూ ఉండదు .. నిజాయితీగా తనకు అనిపించింది అనిపించినట్లు మాట్లాడుతారు ..ఒకరిని ఆకట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడూ అలా మాట్లాడడు.. పవన్ లో అదే నాకు బాగా నచ్చింది అంటూ చెప్పుకు వచ్చింది. ప్రస్తుతం లయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . జనసైనికులు లయకు సపోర్ట్ చేస్తున్నారు..!!