దుల్కర్ సల్మాన్ జంటగా సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అచ్చ తెలుగు ఆడపిల్లల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన మృణాల్‌కు తర్వాత వరస ఆఫర్లు క్యూ కట్టాయి. అయినా కథలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తను నటించే ప్రతి సినిమాతోనూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటుంది మృణాల్. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించి మెప్పించింది.
ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. మృణాల్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కాగా ఇటీవల ఆమె మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న సంజయ్ లీల భన్సాలి ప్రొడెక్షన్‌లో ఆమె ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మామ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రవి ఉద్యవర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా రొమాంటిక్ డ్రామా స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కనుందట.
దీంట్లో మ్యూజిక్ ఎంతో ఇంపార్టెన్స్ ఉందని సమాచారం. అంతేకాదు దీనికి భన్సాలి స్వయంగా సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కనుందని సమాచారం. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే సంజయ్ లీలా లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమా అవకాశాన్ని మృణాల్ అందుకోవడంతో.. అమ్మడు నిజంగానే జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా.. ఈ సినిమాతో హిట్ ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.