జబర్దస్త్ కామెడీ షో లో ఇప్పటికే ఎంతోమంది యాంకర్లు, జడ్జిలు మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంతకాలంగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఇంద్రజ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. జబర్దస్త్ గుడ్ బై చెప్పబోతున్నట్లు వివరించింది. జడ్జ్‌గా రోజా షోకు గుడ్ బై చెప్పిన తర్వాత.. ఇంద్రజ కొన్ని రోజులు, కుష్బూ కొన్ని రోజులు, సదా కొన్ని రోజులు, ఆమని కొన్ని రోజులు ఇలా జడ్జ్లు మారుతూ వచ్చారు. చివరకు కుష్బూ, ఇంద్రజ జడ్జిలుగా ఫిక్స్ అయ్యారు. ఇక ఇటీవల కుష్బూ వెళ్ళిపోవడంతో ఇంద్రజానే 2 షోలను బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఇంద్రజ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తుంది.
తాజాగా ఈ విషయాన్ని ఆమె వివరించింది. జబర్దస్త్ షోకి ఆమె గుడ్ బై చెప్పబోతున్నాను.. కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నా.. ఈ లోపు కొత్త జడ్జ్‌గా ఎవరు ఉంటారు అనే అంశం చర్చినీయాంశంగా మారింది. అయితే ఇంద్రజషోకు గుడ్ బై చెప్తూ ఎమోషనల్ అయింది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. జబర్దస్త్ ను ఓ ఫ్యామిలీగా భావించానని. అందరూ ఆమెను అమ్మలా ట్రీట్ చేస్తూ ఎంతో ప్రేమగా చూస్తున్నారని.. తను కూడా అంతే ప్రేమగా వారితో ఉందని వివరించింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలపడిందని.. దీంతో ఈ షో నుంచి వెళ్ళిపోతుంటే బాధగా ఉందంటూ ఎమోషనల్ అయింది.
అయితే ఇప్పుడు కొత్త జడ్జిగా మళ్ళీ కుష్బూ వస్తుందా.. లేదా ఇంకెవరైనా సీరియల్‌నటిని తీపుకుంటారా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంద్రజ ప్లేస్ లు మరెవరో వచ్చినా కొంతకాలం షోపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనడంలో సందేహం లేదు. అయితే గతంలో కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ లాంటివారు కూడా ఇప్పుడు షోలో లేకపోవడం అలాగే ఎంటర్టైన్ చేసే జడ్జ్ కూడా షోకు గుడ్ బై చెప్పేస్తే.. దీని ఇంపాక్ట్ కచ్చితంగా రేటింగ్ పై పడుతుందని వారి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్ షో మెల్ల మెల్లగా పడిపోయినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.