తెలుగు బ్యూటీ కామాక్షి భాస్కర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల బెస్ట్ యాక్టర్స్ అవార్డును సొంతం చేసుకుంది. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో.. ఈమెకు అవార్డు దక్కడంతో నెటింట తెగ ట్రెండ్ అయింది. విరూపాక్ష, పొలిమేర, పొలిమేర 2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్ ఎలా వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ కంటెంట్ ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించింది. ఈ అమ్మడు వైవిధ్యమైన క్యారెక్టర్లలో చేసి ఆకట్టుకున్న కామాక్షి.. తాజాగా సైతాన్ వెబ్ సిరీస్ లో ఒక్కసారిగా బోల్డ్ లుక్ లో మెరిసి షాక్ ఇచ్చింది.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామాక్షి చేసిన హాట్ కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి. ఆమె సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ బోల్ట్ క్యారెక్టర్ చేయడానికి అయినా, అమాయకపు అమ్మాయిగా నటించడానికి అయినా దేనికైనా రెడీ అంటూ వివరించింది. అది ఎలాంటి క్యారెక్టర్ అయినా నటికి ఒక్కటే. కథను అనుసరించే విధంగా పాత్ర ఉండాలి. ఆ రోల్ పండించడం నటిగా నా కర్తవ్యం. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే బట్టలు లేకుండా నటించడానికి అయినా నేను సిద్ధమంటూ చెప్పుకొచ్చింది.
ఈరోజు ఉండి రేపు ఊడిపోయే ఫేమ్, అందం గురించి నేను పెద్దగా పట్టించుకోనని.. నేను మంచి డాన్సర్‌ని. పాట నచ్చి మంచి యాక్టర్ పక్కన అయితే.. స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఓకే.. ఈ విషయాన్ని గుర్తుంచుకోని దర్శకులు ఆఫర్లు ఇవ్వండి అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం కామాక్షి భాస్కర్లా చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్ గా చెప్తుంది అంటూ.. ఏదైనా నిజాయితీగా మాట్లాడే మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కచ్చితంగా ఎదగాలి అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.