అమ్మ బాబోయ్.. రామయణ ఫస్ట్ పార్ట్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..? బాహుబలి రికార్డ్స్ తుక్కు తుక్కు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు ..మేకర్స్ కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు . ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన అన్ని చిన్న సినిమాలు హిట్ అయ్యాయి.. రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . ఈ క్రమంలోనే పెద్ద బడ్జెట్ పెట్టాలంటే మేకర్స్ ఆలోచిస్తున్నారు .

అయితే బాహుబలి తర్వాత ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టిన మేకర్స్ నే లేరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో స్టార్ హీరో రన్బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా ..నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాను నితేష్ తివారి తెరకెక్కిస్తున్నాడు . నమిత్ మిల్హోత్రా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఒక న్యూస్ లీకై వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం మొత్తంగా 835 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కేవలం ఒక్క పార్ట్ కోసం మాత్రమే ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారట మేకర్స్. ప్రతి విషయంలోనూ చాలా కేర్ఫుల్ గా పకడ్బందీగా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్ . దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు . రన్బీర్ – సాయి పల్లవి నటించిన రామాయణ సినిమా మామూలుగా ఉండదు అంటూ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..!!