వాట్.. టిల్లు గాడి అమ్మ ఓ న్యూస్ రీడర్ ఆ.. ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు..

ఇటీవల డీజె టిల్లు సిక్వెల్‌గా టిల్లు స్క్వేర్ తెరకెక్కి రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టడమే కాదు.. 300 గ్రాస్ వైపు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇంకా చాలా సినిమాలు వస్తాయంటూ ఇటీవల సినిమా మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే డిజేటిల్లు సినిమా గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన సుజాత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నటి సుజాత గురించి కూడా చాలామంది సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారట. అయితే ఈమెకు ఎలాంటి సోషల్ మీడియా ప్రొఫైల్ లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు ఏవి చాలామందికి తెలియలేదు.

డీజే టిల్లు రెండు సినిమాల్లో కూడా ఈమె ఇల్లు తల్లిగా నటించింది. ప్రస్తుతం ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయట. ఇక సుజాత విషయానికి వస్తే సుజాతా గతంలో న్యూస్ రీడర్గా పనిచేసింది అనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఈమె చాలా అందంగా ఉండేది.. అప్పట్లో ఈమె ఫోటో చూస్తే హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు అనే విధంగా ఉండేది ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంది. ఆమెకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి అని.. నటన అంటే చాలా ఇష్టమని వివరించింది.

ఇంట్లో ఇబ్బందుల కారణంగా బయటకు వెళ్లడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదని.. అయితే న్యూస్ రీడర్గా మీడియాలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అందరిని ఒప్పించి ఎలాగో మీడియా ఫీల్డ్ కైతే వచ్చానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడంతో మీడియా నుంచి కూడా దూరమైంది. తాజాగా ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి తల్లి పాత్ర అయితే బెటర్ అని ఫిక్స్ అయిందట. ఈమెకు సినిమా అవకాశం మొదట తరుణ్ భాస్కర్ ఇవ్వడం విశేషం. పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించి మెప్పించిన సుజాత.. తర్వాత డీజే టిల్లు సినిమాలో టిల్లు గాడి తల్లిగా అవకాశాన్ని అందుకుంది. సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ లోను ఈమె నటించింది. నటించిన ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. దీంతో సుజాతకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.