అప్పట్లో ఆ స్టార్ హీరో క్రేజ్ చూసి షాక్ అయ్యా..నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

బయట ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్న వారికి కూడా ఒక ఫేవరెట్ హీరో ఉంటారు. అలా తాజాగా తన ఫేవరెట్ హీరో ని బయటపెట్టాడు నవీన్ చంద్ర. మొదట్లో అనేక సినిమాల్లో హీరోగా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్న నవీన్ చంద్ర ప్రస్తుతం వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇక నవీన్ చంద్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒక స్టార్ హీరో ఫాలోయింగ్ చూసి షాక్ అయినట్లు వెల్లడించాడు. మరి ఆ హీరో మరెవరో కాదు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పుకోవచ్చు. అతనికి హిట్ పడే కొద్ది అభిమానుల సంఖ్య ఓ రేంజ్ లో పెరుగుతూ ఉంటుంది.

అయితే ప్రభాస్ కి సెన్సేషనల్ బ్రేక్ ఇచ్చిన వర్షం మూవీ టైం లోనే అతడి క్రేజ్ చూసి షాక్ అయినట్లు వెల్లడించాడు హీరో నవీన్ చంద్ర. రీసెంట్ గా ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు నవీన్ చంద్ర. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాను ప్రభాస్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.