విజయశాంతి చేతిలో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పాన్ ఇండియన్ స్టార్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ విజయశాంతికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమర్షియల్ సినిమాల్లోనూ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. లేడి సేప‌ర్ స్టార్ బిరుదు ద‌క్కించుకుంది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ పై ఫోటోలో విజయశాంతి చేతిలో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న పాన్ ఇండియన్ స్టార్.

వ‌రుస సినిమాల‌తో బిజీ లైన‌ప్‌తో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో కాదండి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే వ‌రుస హిట్‌లు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్య పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ న‌ట‌న‌తో త‌న స‌త్తా చాటాడు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పాన్ ఇండియా స్టార్ గా భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు.

ప్రస్తుతం చరణ్ ఓ బడా ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక‌ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. అలాగే బుచ్చిబాబు సన్న డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించేందుకు చరణ్ సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్గా జరిగాయి. ఇక ఈ మూవీలో దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వి క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.