విజయ్ దేవరకొండతో నటించనే నటించను అని తెగ్గేసి చెప్పేసిన త్రిష.. కారణం ఏంటంటే..?

విజయ్ దేవరకొండ ..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ రౌడీ ..ఆటిట్యూడ్ హీరో ..సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే నాటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునే హీరోలు చాలా చాలా రేర్ గా ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు మన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించే సినిమాలు ఎంతలా యువతను ఆకట్టుకుంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో చూస్ చేసుకున్న సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ అంటే అందరికీ మొదటి గుర్తొచ్చే సినిమా మాత్రం అర్జున్ రెడ్డి .

ఈ సినిమాలో ఆయన కాకుండా మరి ఏ హీరో పెట్టిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అలాంటి హీరోతో నటించాలి అని ప్రతి ముద్దుగుమ్మ ఆశపడుతుంది. కానీ అలాంటి అవకాశాన్ని వస్తే స్వయాన రిజెక్ట్ చేసుకునేసింది హీరోయిన్ త్రిష . దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా గీతాగోవిందం .

ఈ సినిమాలో నిత్యామీనన్ స్పెషల్ కేమిమో రోల్ లో కనిపించింది . ఈ పాత్ర కోసం మొదటగా హీరోయిన్ త్రిష ని అప్రోచ్ అయ్యారట . అయితే త్రిష మాత్రం ఇలాంటి చిన్నాచితకా పాత్రలో కనిపించను అని ..అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే అంటూ రిజెక్ట్ చేసిందట . అంతేకాదు ఆ తర్వాత కూడా విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు వచ్చినా కూడా త్రిష ఇంట్రెస్ట్ చూపించలేదట . రీజన్ ఏంటో ఆమెకే తెలియాలి..!