యూట్యూబ్ లో సరికొత్త సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన “ఊ అంటావా మావ” పాట.. సమంత రేంజే వేరబ్బ..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అని మనం చెప్పలేం ..కానీ ఖచ్చితంగా సినిమాలో ఐటమ్ సాంగ్ మాత్రం కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది . సినిమాలో ఆరు పాటలున్న ఐదు పాటలు మినహా ఒక్క ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది . ఆ ఒక్క పాట కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించేస్తుంటుంది. కొన్ని కొన్ని సార్లు నాటి పదాలతో కైపెక్కిచ్చేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ లు.

కాగా సినిమా ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది సమంత తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేసిన పాట ఊ అంటావా మావ. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకునన్న సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించి మెప్పించింది.

అయితే ఈ సినిమాలో రష్మిక కన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ దక్కించేసుకునింది అందాల ముద్దుగుమ్మ సమంత . ఫస్ట్ టైం కెరియర్ లోనే ఐటెం సాంగ్ నటించి సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ .. చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకు హైలైట్ ఇచ్చాయి. ఊ అంటావా మావ అంటావా మావ అనే లిరిక్స్ తో ఊరు రేంజ్ లో దేశాన్ని ఊపు ఊపేస్తుంది . ఇప్పటికీ ఈ పాట పలు ఫంక్షన్స్ లో మారుమ్రోగిపోతుంది ..అంటే కారణం సమంత హాట్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి . తాజాగా ఈ పాట సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది.

ఊ అంటావా మామ పాట తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి . కానీ ఏది కూడా ఈ పాట రికార్డ్స్ బ్రేక్ చేయలేకపోయింది. ఈ పాట అప్పట్లోనే భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఈ పాట రిలీజ్ అయిన 68 రోజుల్లోనే యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ పాట దక్కించుకున్నన్ని వ్యూస్ మరి ఏ పాట దక్కించుకోకపోవడం గమనార్హం .

యూట్యూబ్లో ఇంత తక్కువ టైంలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా సరికొత్త రికార్డు సృష్టించింది ఊ అంటావా మావ. గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం లోని బుట్ట బొమ్మ సాంగ్ 20 కోట్ల వ్యూయ్స్ దక్కించుకుంది. కానీ 95 రోజులు టైం తీసుకుంది . రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ కూడా 20 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. కానీ 78 రోజుల సమయం పట్టింది . కేవలం 68 రోజుల్లోనే 20 కోట్ల వ్యూస్ దక్కించుకున్న పాటగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పింది..సమంత ఊ అంటావా మావ పాట..!