ఈ బెస్ట్ హోమ్ రెమెడీస్‌తో లో బీపీకి ఇట్టే చెక్ పెటొచ్చు.. తప్పక ఫాలో అవ్వండి..

ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్, ఆహార పొలవాట్లతో చాలామంది లో బీపీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెల్సిందే. ఈ లోబీపీ అనేది తక్కువ రక్తపోటు సమస్య లేదా హైపోటెన్షన్ అని వర్ణిస్తూ ఉంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. దీనికంటే తక్కువగా ఉంటే దానిని లోబీపిగా సూచిస్తారు. దీని వల్ల మీరు ఎల్లప్పుడూ అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోబీపీకి ముఖ్య కారణం డిహైడ్రేషన్, విటమిన్ b12 లోపం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు మీ జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులను చేసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

ఆహారం పట్ల తీసుకునే శ్రద్ధలో ఈ లోబీపీని నియంత్రించవచ్చు. ఇంతకీ లోబిపి నియంత్రించే ఇంటి చిట్కాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. లోబీపీ సమస్య ఉన్న వారు పొటాషియం కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అరటి పండ్లు, బంగాళదుంప, ఆకుకూరలు, బీన్స్, పాలకూర లాంటి ఆహార పదార్థాల్లో పొటాషియం సమృద్ధిగ లభిస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహకరిస్తుంది. దీంతో పాటు సోడియం తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారంకు దూరంగా ఉండాలి. అవిసె గింజలు, వాల్నట్స్, చేపలు లాంటి వాటిలో ఒమేగా 3 ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి. రక్తపోటును తగ్గించడానికి ఇవి సహకరిస్తాయి. దీంతోపాటే ఓట్స్, గోధుమ రొట్టె, పండ్లు, కూరగాయలు లాంటివి ఫైబర్ కూడా రక్తపోటును తగ్గించడానికి సహకరిస్తుంది.

ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగిపోవడం విపరీతమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మితంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్య సమస్యలకు ఇట్టే చెక్ పెట్టవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ కనీసం 30 నిమిషాలైనా రోజుకు వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. నడక, పరుగు, స్విమింగ్‌, సైక్లింగ్ లాంటివి బాగా తోడ్పడతాయి. అధిక బరువుతో ఉన్నట్లయితే కొన్ని పౌండ్లు కోల్పోవడం మీ రక్తపోటును గణనీయంగా తగ్గడానికి తోడ్పడుతుంది. స్మోకింగ్ చేసే అలవాటు కూడా లోబీపీ సమస్యకు ప్రధాన కారణంగా ఉంటుంది. కనుక లోబీపీ ఉన్నవారు స్మోకింగ్ కు దూరంగా ఉండటం మంచిది. అలాగే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం. ఈ పై ఇచ్చిన ఆహార విధాలను ఫాలో అయితే మీ లోబీపీ సమస్యకు చెక్ పడినట్టే.