ఆ సూపర్ హిట్ సినిమా రిజెక్ట్ చేసిన నాని.. కారణం ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాని.. పక్కింటి కుర్రాడులా అందరిని మెప్పిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఆయ‌న‌ చేసే అన్ని సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు అందుకుంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని గతంలో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆయన రిజెక్ట్ చేసిన ఓ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుందట.

Ishq (2012 film) - Wikipedia

ఇంతకీ అది ఏ సినిమా.. నాని రిజెక్ట్ చేసిన ఆ సినిమాలో హీరోగా ఎవరి నటించారో అనుకుంటున్నారా. అది ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ .కే కుమార్ మొదటిసారి నానితో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాడట. కానీ నాని ఈ మూవీ టైంలో అలా మొదలైంది సినిమాతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమాను చేయలేకపోయాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా నితిన్ చేసి చాలా సంవత్సరాల తరువాత ఒక కంబ్యాక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నితిన్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. విక్రమ్ .కే కుమార్, నానితో జెంటిల్మెన్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Nani-Nitya Menen's 'Ala Modalaindi' joins the re-release bandwagon-Telangana Today

ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నాని కెరీర్ లో ఓ డీసెంట్ సినిమాగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని వరుసగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్టార్ స్టేట‌స్ సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల పాన్‌ ఇండియా లెవెల్ లో హాయ్ నాన్న సినిమాతో హిట్ అందుకున్న నాని.. రాబోయే రోజుల్లో సరిపోద్దా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాత‌లోలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతే కాదు బలగం పేమ్‌ డైరెక్టర్ వేణుతో మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని.