సినిమా అవకాశాల కోసం అంతకు బరితెగించిన కృతి శెట్టి.. ఏకంగా ఆ నిర్మాతకే బంపర్ ఆఫర్ ఇచ్చింది గా..!

బుచ్చిబాబు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఉప్పెన’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. వైష్ణవి తేజ్ హీరోగా నటించిన ఈ యూత్ ఫుల్ లవ్ డ్రామా భారీ విజయం అందుకోవటంతో కృతి శెట్టి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, దివారియర్, కస్టడి వంటి చిత్రాల్లో నటించి తన కంటూ సొంత గుర్తింపుని సంపాదించుకుంది.

కానీ ఈ అమ్మడు నటించిన పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో శ్రీలీల టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి కృతి శెట్టికి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళ,తమిళ్ భాషల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

సినిమాల అవకాశాలు తగ్గిన కారణం గా… ఈ భామ నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుందట. గతంలో 2 కోట్లు రూపాయలు డిమాండ్ చేసిన ఈమె కోటిన్నర పారితోషికం ఇచ్చిన అంగీకరిస్తుందంట. అంతేకాకుండా ఎంతటి గ్లామరస్ పాత్రలకైనా రెడీగా ఉందని సమాచారం. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.