పెళ్లి కంటే ముందు అది చేయడమే ముఖ్యం.. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేడీ విలన్ గా సెన్సేషనల్ మార్క్ను క్రియేట్ చేసుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కి మంచి క్రేజ్ దక్కింది. స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

2024 లో చిన్న సినిమాగా విడుదల భారీ సంచలనం సృష్టించిన హనుమాన్ మూవీలో కూడా తేజసజా కి అక్క పాత్రలో పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక తాజాగా శబరి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర కామెంట్లు చేసింది. ” అసలు ప్లాన్ చేసుకోకుండానే నా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.

త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. అయితే వివాహం అనేది నాకు పెద్ద సర్ప్రైజ్ లాంటిది. కాబట్టి గుర్తుండి పోయేలా చేసుకుంటాను. కానీ నాకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ సినిమా.. పెళ్లి కంటే ముందు యాక్టింగ్ వీలైనంతవరకు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తాను. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే నేను షూటింగ్లో పాల్గొన్నాను. సినిమాల తర్వాతనే నాకు ఏదైనా ” అంటూ కామెంట్స్ చేసింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.