అయోధ్య రామమందిరం పై రూపొందిన సినిమా.. ఎక్కడ చూడొచ్చు అంటే..!

అయోధ్యలో బాల రాముడు కొలువు తీరిన విషయం దేశవ్యాప్తంగా తెలిసిందే. జనవరి 22న ఈ ప్రతిష్టాపన జరిగింది. అయితే త్వరలో అయోధ్యలోని రామ మందిరం పై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. రామ అయోధ్య పేరుతో తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూవీలో అయోధ్య రామ మందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపించనున్నారు. హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి అనుబంధం, అయోధ్య విశేషాలు, రామ మందిరం నిర్మాణ విశేషాలను ఈ మూవీ ద్వారా తెలియజేయనున్నారు.

ఈ మూవీకి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా రామ అయోధ్య పేరుతో పెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీ లో ఏప్రిల్ 17 నుంచి సందడి చెయ్యనుంది. ఇక ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు ఆహా వారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల్లో ఎంత మేరా వెళ్తుందో చూడాలి. రామ మందిరం ప్రతిష్టాపన అనంతరం రానున్న సినిమా కనుక ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అందరూ భావిస్తున్నారు.