ఎస్.. నాకు బ్రేకప్ అయింది.. సైకో లవర్ ని వదిలించుకోవడం చాలా కష్టం.. టాలీవుడ్ సింగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సింగర్ శ్రీరామ్ చంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ ఇండియన్ ఐడల్’ గెలిచిన ఆయన…ఒక్కసారిగా ఇండియా వైడ్ పాపులారిటి సొంతం చేసుకున్నాడు. పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చి ..రెండు తెలుగు రాష్ట్రంలో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్బాస్ హౌస్లో తన యాటిట్యూడ్ తో, గేమింగ్ తో చివరివరకు రాణించిన శ్రీరామ్ చంద్ ఫైనల్ కప్ మాత్రం గెలుచుకోలేకపోయాడు.

మూడో స్థానం వరకు వచ్చి మిగిలిపోయాడు. ప్రస్తుతం పలు చిత్రాలకు ప్లే బ్యాక్ సింగర్ గా పాటలు పాడుతూ..బిజీగా ఉన్న శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ ఫేమ్ రీతు చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘దావత్’ ఈ షో కి గెస్ట్ గా వెళ్లిన శ్రీరామ్ చందు రీతు బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే ఏమాత్రం తడబడకుండా ఆమె అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చాడు చందు.

ఈ క్రమంలో తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ…’ గతంలో నేను రిలేషన్ లో ఉండేవాడిని.కానీ ప్రస్తుతం బ్రేకప్ అయ్యింది. ఆ రిలేషన్ కి సంబంధించిన దెబ్బ గట్టిగానే తగిలింది. రిలేషన్ వర్కాట్ కాకపోతే బ్రేకప్ అవుతాయి. దీని నుండి బయటకు వచ్చేందుకు మరొకటి స్టార్ట్ అవుతోంది. కానీ కొందరు జిడ్డులా పట్టుకొని వద‌లారు. అలాంటి సైకో లవర్స్ ని వదిలించుకోవటం కష్టం. కానీ అలాంటి వాళ్లను వదిలించు కోవటం మంచిది. ప్రస్తుతం నాకు సెట్ అయ్యే అమ్మాయి కోసం వెతుకుతున్న. ఇంకా దొరకలేదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు.