పబ్లిక్ లో అలాంటి పని చేసిన అభిమాని .. తిక్క రేగిన విశ్వక్ సేన్ ఏం చేశాడో చూడండి..!

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ..ఎవరైనా స్టార్ సెలబ్రిటీ బయట కనపడితే చాలు ఫోటోగ్రాఫ్ లు.. సెల్ఫీలు అంటూ టార్చర్ చేస్తున్నారు. హీరోయిన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే హీరోలకు కూడా అదే పరిస్థితి చాలా సార్లు ఎదురయింది. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు విశ్వక్ సేన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గామి.

ఈ సినిమా ఎంతటి హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుందో మనకు తెలిసిందే. సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు విశ్వక్ సేన్. కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కింది. ఇదే క్రమంలో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు విశ్వక్సేన్ అండ్ టీం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ఈ క్రమంలోనే చాలామంది విశ్వక్ – చాందినిని చూసి సెల్ఫీలు తీసుకోవడానికి గుంపులు గుంపులుగా ఎగబడ్డారు .

స్టార్స్ ను కాస్త ఇబ్బందులకు గురి చేసే విధంగా బిహేవ్ చేశారు .కొందరు యువకుల విశ్వక్ తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా .. విశ్వక్ సరదాగా వారి చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు ..ఆ అభిమాని తన ఫోన్ ఇవ్వమని అడుగుతూ ఉంటే “నాకు గిఫ్ట్ గా ఇచ్చానని అనుకో..” అంటూ కాసేపు అతనిని ఆటపట్టించారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు . విశ్వక్ సేన్ మరి నాటి ఫెలో ..విశ్వక్సేన్ అల్లరోడు అంటూ చెప్పుకొస్తున్నారు..!!