పెట్టుకోక.. పెట్టుకోక.. మహేష్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న విశ్వక్సేన్… కుర్చీ మడత పెట్టాల్సిందేగా..?

మహేష్ బాబు.. పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కుతుందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అదేవిధంగా మరో టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కూడా మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈయన. ఇక మహేష్ అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోకపోయినా ఏదో కొద్దో గొప్ప ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా పెట్టుకోక పెట్టుకోక మహేష్ ఫ్యాన్స్ తోనే పెట్టుకున్నాడు విశ్వక్సేన్. రియల్ లైఫ్ లో కూడా ఒకే టోన్ మరియు అదే బేస్ వాయిస్ తో మాట్లాడే విశ్వక్సేన్ ఈసారి మహేష్ ఫ్యాన్స్ కి మండిచ్చాడు. నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు.

అసలు విషయంలోకి వెళ్తే.. తన సినిమా గామి ని ప్రమోట్ చేసే సమయంలో తన సినిమాను కూడా కొందరు ప్రోత్సహిస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేశాడు. నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడాలి అంటూ వెల్లడించాడు. ఈ కామెంట్స్ కేవలం మహేష్ అండ్ రాజమౌళి కోసమే చేసినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఇటీవలే రిలీజ్ అయిన ప్రేమలు మూవీ ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి పాల్గొనగా మహేష్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ మూవీని ప్రమోట్ చేశాడు. కానీ దానిపై మాత్రం వీరిద్దరూ స్పందించలేదు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని విశ్వక్సేన్ మహేష్ మరియు జక్కన్న పై మండిపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.