పుష్ప 2.. అభిమానులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేది అప్పుడే..?!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప 2: ది రూల్.. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న న‌టిస్తుంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ రిలీజ్‌ కానున్నట్టు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే త్వరలోనే మేకర్స్ ఈ విష‌యాని అఫీషియల్‌గా అనౌన్స్ చేయ‌నున్నారు.

అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్ త‌ధిత‌రులు ఈ మూవీలో కీల‌క‌పాత్ర‌లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ కు కొద్ది కాలమే ఉండడంతో.. అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే రిపోర్ట్ ల ప్రకారం పుష్పా.. ది రూల్స్‌ విడుదలకు నాలుగు నెలలు ఉండగా.. టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి తాజాగా 21 ఏళ్ల పూర్త‌యింది. ఆయనకు ఓ విధంగా ఇది స్పెషల్ ఇయర్. అల్లు అర్జున్ కెరీర్ లోనే పుష్ప పార్ట్ 1 అత్యధిక వసూళ్లను సాధించి ఆయన మార్కెట్ ను రెట్టింపు చేసింది. ఇక పుష్ప 2 ఈ ఏడాది విడుదల కానుండడంతో 2024 ఆయనకు మరింత స్పెషల్ గా మారింది. ఇక తాజాగా బ‌న్నీ ఫస్ట్ మూవీ గంగోత్రి రిలీజ్ 21 ఏళ్లు పూర్తయింది. సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సందర్భంగా.. బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్లో మేకర్స్ ఉన్నారట.