“అలాంటి వాడు లైఫ్ లో ఒక్కడు ఉన్నా చాలు”.. మనసులోని కోరికను పచ్చిగా బయటపెట్టేసిన నీహారిక..!

నిహారిక .. ఈ మధ్యకాలంలో అమ్మడు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక మాట్లాడిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి చూస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా నిహారిక సాగు కోసం ప్రమోషన్స్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది.

” మన లైఫ్ లో కొన్ని కొన్ని నిర్ణయాలు మనం ఎందుకు తీసుకుంటామో మనకు తెలియకపోవచ్చు.. కానీ దెబ్బ పడినప్పుడు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు మనకంటూ ఒక మనిషి ఉండి సపోర్ట్ చేసే ..వాళ్ళు ఉంటే చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది.. లైఫ్ లో ముందుకు వెళ్లాలి అన్న ఆలోచనలు కూడా మనకు వస్తాయి.. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నా కుటుంబం నా స్నేహితులు నాకు చాలా అండగా నిలిచారు “..

“మనం కష్టంలో ఉన్నప్పుడు ఏం కాదులే నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఒక్కరు ఉన్న చాలు లైఫ్లో ముందుకు వెళ్లొచ్చు “అంటూ నిహారిక చాలా పెద్దరికంగా మాట్లాడింది. చాలా మంది నిహారిక మాట్లాడిన మాటలకు కనెక్ట్ అయిపోతున్నారు. నిజమే చిన్న వయసులోనే ఇంత పెద్ద మెచ్యూరిటీగా మాట్లాడడం నిహారిక పడిన కష్టానికి ఫలితం అంటూ చెప్పుకొస్తున్నారు.

జొన్నలగడ్డ చైతన్యలో పెళ్లి చేసుకున్న నిహారిక ఆ తర్వాత అతగాడికి విడాకులు ఇచ్చేసింది . వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకున్నారు ఆ తరువాత పలు సినిమాల్లో నటించడానికి సిద్ధపడింది . ప్రజెంట్ చేతిలో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది నిహారిక..!!