ఓ మై గాడ్.. ఈ మహేష్ బ్యూటీ ఏంటి ఇలా మారి పోయింది.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఏ కారణంతో దూరమైనా.. తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫొటోస్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే అందంగా ఇప్పుడు కూడా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది ఇండస్ట్రీకి దూరమైన కొంతకాలానికే షేప్ అవుట్ అయ్యి గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు.

అలా ఈ పై ఫోటోలో ఉన్న హీరోయిన్ కూడా లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఒకప్పుడు కుర్రాళ్ళ కలలు రాకుమారిగా ఉన్న ఈ చిన్నది.. తన అందంతో ఎంతమంది తెలుగు ఆడియోస్న్‌ను ఫిదా చేసింది. ఈ వయ్యారిభామ ఒకప్పుడు మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. అయితే తాజాగా ఈమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..? ఒకప్పటి స్టార్ బ్యూటీ రక్షిత.

నిజం సినిమాలో మహేష్ తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో ఇడియట్ సినిమాతో పరిచయమై ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగు తో పాటు కన్నడ భాషలోనూ ఈమె సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్‌ పిక్స్ నెట్టింట వైర‌ల్ కావ‌డంతో ఇవి చూసిన నెటిజన్స్ అంతా ఒకప్పటి ఆ నాజుకు సుందరి.. ఇప్పుడు ఎంటి ఇలా అయిపోయింది అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.