ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చిన అనుష్క శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు సక్స‌స్‌ఫుల్‌ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలోను హీరోయిన్గా మెప్పించింది అనుష్క. అయితే చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా.. మీడియాకు కనిపించకుండా ఉంటుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్‌ను షేర్ చేయడం మానేసింది. దీంతో స్వీటీ ఎలా ఉంది అనే సందేహం అనుష్క ఫ్యాన్స్ లో మొదలైంది.

ఈమె బరువు పెరిగిపోవడం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉంటుందని.. కెమెరా కంటపడకుండా త‌ప్పించుకుంటుంద‌ని రూమర్లు తెగ చక్కెరలు కొట్టాయి. ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనుష్క.. శ్రీకృష్ణుడు విగ్రహాన్ని పట్టుకొని నిర్మలంగా నవ్వుతూ కనిపించే ఫొటోస్ నెటింట వైర‌ల్ అవుతున్నాయి. మలయాళంలో తను నటిస్తున్న కొత్త సినిమా కాథ‌నార్‌ మూవీ టీం తో కలిసి అనుష్క ఫోటోలకు స్టీల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలో అనుష్క ఎంతో ప్లేసేంట్ గా కనిపించింది.

నిండు వైభవంగా.. ఆనందంతో నవ్వుతూ.. నిర్మలంగా కనిపించడంతో అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కావడంతో అనుష్క అభిమానుల్లో ఈమె ఆరోగ్యంగా ఉందని విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక చాలా కాలం తర్వాత అనుష్క లేటెస్ట్ పిక్స్ కనిపించడంతో అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అనుష్క రోజిన్ థామస్ డైరెక్షన్లో వస్తున్న ఈ మలయాళ హారర్ ఫాంటసీ మూవీ కథనార్ షూటింగ్లో బిజీగా ఉంది.