జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన నాగ చైతన్య .. ఆ హిట్ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా..?

నాగచైతన్య.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారడానికి ట్రై చేస్తున్న హీరో . ఒకటి కాదు రెండు కాదు కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కానీ సక్సెస్ అందుకుంది మాత్రం చాలా తక్కువ . ప్రెసెంట్ చందు మండేటి దర్శకత్వంలో “తండేల్” అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో బిగ్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాడు .

నాగచైతన్య విరుపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. నాగచైతన్య కెరియర్ లో హర్రర్ జోనర్ సినిమాలు చాలా తక్కువ . దూత వెబ్ సిరీస్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడానికి బాగా ట్రై చేశాడు . సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఫుల్ లెంత్ మూవీని హార్రర్ జోనర్ లో టచ్ చేయాలనుకుంటున్నాడట . అందుకే విరుపాక్ష డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారట .

విరుపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన కార్తీక్.. నాగచైతన్యతో సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమా కెవ్వు కేకే అంటున్నారు అక్కినేని అభిమానులు . నాగచైతన్య ఖాతాలో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫామ్ అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా సంయుక్త మీనన్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . చూద్దాం మరి నాగచైతన్య టైం ఏ విధంగా మారబోతుందో.. ఈ సినిమాతో హిట్ కొడితే నాగచైతన్య రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ..? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..!!