మీ భర్త / భార్య పడుకునే ముందు అలా చేస్తున్నారా ..? అయితే బిగ్ డేంజర్ లో ఉన్నట్లే జాగ్రత్త..!

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధం ఎంత బిజీగా మారిపోయిందో అందరికీ తెలిసిందే . పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి వస్తుంది. మరి ముఖ్యంగా టెకీస్ అయితే ఉదయం ఎప్పుడో ఆఫీసుకు వెళ్లి ..రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తారు . వచ్చిన తర్వాత కూడా ఇంటి పనులతోనే సమయం గడిచిపోతుంది . సరదాగా గడిపే మూమెంట్స్ చాలా చాలా తక్కువ . ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే ఆ ప్రాబ్లమ్స్ మరింత కఠినంగా ఉంటాయి. ఆ బాధ ఇద్దరు ఉద్యోగాలు చేసే భార్యాభర్తలకే అర్థమవుతుంది .

అయితే ఈ మధ్యకాలంలో వర్క్ ప్రెజర్ పెరిగిపోయి పలువురు సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసే టెకీస్ ..ఇతర రంగాలలో బిజీబిజీగా టెన్షన్స్ పడే వ్యక్తులు అర్ధరాత్రి వరకు నిద్రపోవడం లేదు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇంట్లో పనులు ముగించుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళాక ఎవరి దారి వారిది అంటూ చిరాకు చిరాకుతో ..రేపు ఉదయం ఏం పనులు చేయాలి..? అంటూ టెన్షన్ పడే సిచువేషన్ సే ఎక్కువగా చూస్తూ వస్తున్నాం.

గతంలో చాలామంది డాక్టర్స్ కూడా దీని గురించి ఓపెన్ గా మాట్లాడారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కనీసం రాత్రిపూటైనా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య హెల్తి రిలేషన్షిప్ కొనసాగుతుంది అని ..వాళ్ళ ఆరోగ్యానికి అలాగే మైండ్ సెట్ కి కూడా అది చాలా చాలా మంచిది అని చెప్పుకొచ్చారు. కానీ నేటి కాలం భార్యాభర్తలు బిజీ లైఫ్ షెడ్యూల్స్ కారణంగా ఆ విషయాన్ని మర్చిపోతున్నారు.

మరీ ముఖ్యంగా పనుల ముగించుకుని మంచం ఎక్కితే ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకొని యూట్యూబ్ షాట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్పిస్తే ..ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే కపుల్స్ చాలా చాలా తక్కువ .. అందుకే ఎవరైతే భార్యాభర్తలు పడుకునే ముందు ఫోన్లు చూస్తున్నారో.. వాళ్ళ వైవాహిక బంధం డేంజర్ జోన్ లో ఉన్నట్టే అంటూ డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు . అందుకే ఫోన్లను దూరం పెట్టి ప్రశాంతంగా వైవాహిక బంధాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తే అందరికీ శ్రేయసకరం అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!