టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ స్టార్ట్.. అందరి హీరోలు అదే పని చేయబోతున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్నారా..? హీరోలు అంటే అవును అంటూనే టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతి హీరో కూడా ఒకటే స్ట్రాటజీలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఒక్క సినిమాలో నటిస్తే చాలు ఆ సినిమా ద్వారా ఐదు భాషలలో క్రేజ్ సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా టైర్ 2 హీరోలైన ఎవ్వరైనా సరే ఇదే ఎక్కువగా కోరుకుంటున్నారు .

ఈ క్రమంలోనే మెల్లమెల్లగా ఒక్కొక్క స్టార్ హీరో పాన్ ఇండియా సినిమాల్లో నటించడం అలవాటుగా మార్చేసుకున్నారు. ప్రెసెంట్ బన్నీ – చరణ్-తారక్-ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే లెవెల్లో సినిమాలను ఓకే చేయడానికి సిద్ధపడ్డారు. రీసెంట్గా ఇకపై అన్ని పాన్ ఇండియా సినిమాలే చూస్తారు అంటూ ప్రామిస్ కూడా చేశారు మహేశ్ బాబు.

అంతే కాదు నాని – నిఖిల్ కూడా మెల్లగా పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు . మెగా హీరో వరుణ్ సైతం పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అంతేకాదు ఇక రాబోయే కాలంలో అందరూ హీరోలు కూడా తాము నటించే సినిమాని పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండేలా చూసుకుంటున్నారట . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పోయింది . కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా హిట్ చేసేస్తున్నారు జనాలు . దీంతో టైర్ 2 హీరోలు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారట . ఇకపై ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియా లెవెల్ లోనే తమ సినిమాలు తెరకెక్కాలి అని ప్లాన్ చేస్తున్నారట..!