టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నబ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం.
ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు. భారీ పాన్ ఇండియా మూవీగా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భువన్, శ్రీకర్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో సంయుక్త మీనన్ హీరోయిన్గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్గా నభా నటాషా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందట. రవి బసౄర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఇలాంటి భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడంతో.. నిజంగా జాక్‌పాట్ కొట్టావు నభా. అసలు సినిమాల్లో అవకాశాలే లేని టైంలో.. ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేయడం అంటే అది సాధారణ విషయం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ సారాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ తదితర విద్యల్లో కూడా ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.