“ఆ వార్త విని నా గుండె బద్ధలైంది”.. గుక్క పట్టి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ ఛార్మి పేరు ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్ లో ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మ ఛార్మి పై ఇప్పుడు నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉండడం అభిమానులకి కూడా మింగుడు పడడం లేదు. కాగా సినిమా ఇండస్ట్రీకి టోటల్ గా గుడ్ బాయ్ చెప్పేసిన ఛార్మి ప్రెసెంట్ నిర్మాతగా తన దైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఛార్మి పెట్టిన పోస్ట్ అభిమానులకి కన్నీళ్లు తెప్పిస్తుంది . తన అంకుల్ మరణించాడు అన్న విషయం తాను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టి ఎమోషనల్ పోస్ట్ చేసింది . దీంతో ఛార్మి పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . “మా అత్యంత బలమైన కుటుంబ సభ్యుడు కక్కి మామయ్య అకస్మాత్తుగా చనిపోయారు అన్న వార్త విని చాలా షాక్ అయ్యాను ..

నా గుండె బద్దలైపోయినట్లు అయింది . అసలు జీవితం అంటే ఏంటి అన్నది నాకు అర్థం కావడం లేదు.. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం ..మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను “అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది . ప్రజెంట్ ఛార్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కాగా ఛార్మి రిలేషన్ షిప్స్ కి చాలా వాల్యూ ఇస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే..!!

 

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)